
- కలప అక్రమ తరలింపును అడ్డుకోగా అఘాయిత్యం
- రాజన్న సిరిసిల్ల జిల్లా దేవునితండా శివారులో ఘటన
చందుర్తి, వెలుగు: టేకు కలప అక్రమంగా రవాణా చేస్తుండగా అడ్డుకున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌పై దుండగుడు దాడి చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. సిర్రోళ్ల బాలకృష్ణ రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. శనివారం సాయంత్రం మండలంలోని దేవునితండా శివారులోని ఎల్లమ్మ ఆలయం సమీపంలో టేకు కలపను అక్రమంగా రవాణా చేస్తున్నారనే సమాచారం అందింది.
వెంటనే బాలకృష్ణ బైక్‌పై ఫారెస్ట్ వాచర్ పిట్టల తిరుపతితో కలిసి అక్కడికి వెళ్లారు. దేవునితండాకు చెందిన అజ్మీర తిరుపతి టేకు కలపను అక్రమంగా తరలిస్తుండగా అడ్డుకునేందుకు ప్రయత్నించగా అతడు దాడి చేసి కిందపడేశాడు. అనంతరం అజ్మీర తిరుపతి పారిపోయాడు. సమాచారం అందడంతో ఎస్ఐ అంజయ్య వెళ్లి వివరాలు సేకరించారు. బాధితుడు బాలకృష్ణ ఫిర్యాదుతో నిందితుడు అజ్మీర తిరుపతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.