సర్వమత సామరస్యమే కాంగ్రెస్ లక్ష్యం : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

సర్వమత సామరస్యమే కాంగ్రెస్ లక్ష్యం : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

కోనరావుపేట, వెలుగు: సర్వమత సామరస్యానికి  ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం కోనరావుపేటలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు. మనుషుల మధ్య ప్రేమ, సమాజ శాంతి ఏసుక్రీస్తు మానవాళికి అందించిన గొప్ప బోధన అన్నారు. పేదల సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఫిరోజ్ పాషా, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు వెంకన్న, అజీమ్, రుక్మిణి, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు, లీడర్లు పాల్గొన్నారు. 

 కోనరావుపేట మండలం కొలనూరు గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు ఇస్తారి ప్రవీణ్, బీఎస్పీ గ్రామ అధ్యక్షుడు మెరుగు వెంకటేశం, బీఆర్ఎస్ సీనియర్ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెరుగు దేవయ్య, ప్రశాంత్, వార్డు సభ్యులు పరమేశ్వర్, రామన్నపేటకు చెందిన వార్డు సభ్యులు ఎర్ర కావ్య.. సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారిని ఆది శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి

వేములవాడ అనుబంధ మామిడిపల్లి సీతారామస్వామి ఆలయ ఆవరణలో జనవరి 18న జరిగే మాఘ అమావాస్య జాతరను వైభోవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని విప్‌‌‌‌‌‌‌‌ ఆది శ్రీనివాస్ అధికారులకు సూచించారు. మంగళవారం  ఆలయ ఆవరణలో జాతర ఏర్పాట్లపై అధికారులు నిర్వహించిన రివ్యూకి హాజరై మాట్లాడారు. జాతరకు 40వేల నుంచి 50వేల వరకు భక్తులు వస్తారని పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.