సుల్తానాబాద్, వెలుగు: నియోజకవర్గంలో ప్రధాన పట్టణమైన సుల్తానాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. మంగళవారం సుల్తానాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహం నుంచి శాంతినగర్ వరకు రూ.6 కోట్లతో నిర్మించనున్న రోడ్డు విస్తరణ, నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఇప్పటికే పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలు ఇతరత్రా 70 శాతం పనులు పూర్తిచేసినట్టు తెలిపారు.
మరో ఏడాదిలోపు అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామన్నారు. అనంతరం రూ.8లక్షలు సొంత ఖర్చుతో కొనుగోలు చేసిన గ్రీజర్లను గర్రెపల్లి సోషల్ వెల్ఫేర్, భూపతిపూర్ మహాత్మా జ్యోతిబాపూలే విద్యాలయాలకు ఎమ్మెల్యే అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, మున్సిపల్ కమిషనర్ టి. రమేష్, సర్పంచులు రమేశ్ గౌడ్, పోచంపల్లి చిన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.
