కన్జర్వేషన్ రిజర్వ్​గాకుమ్రంభీం ఆసిఫాబాద్ అడవులు

కన్జర్వేషన్ రిజర్వ్​గాకుమ్రంభీం ఆసిఫాబాద్ అడవులు

ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాను కన్జర్వేషన్ రిజర్వ్ గా మారుస్తున్నట్టు అటవీశాఖ పీసీసీఎఫ్ సువర్ణ తెలిపారు. ఈ మేరకు జీవో  నంబర్49 రిలీజ్​ చేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా బుధవారం డీఎఫ్ఓ ఆఫీసులో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వైల్డ్​లైఫ్​ పరిరక్షణ కోసం కన్జర్వేషన్ రిజర్వ్​గా మార్చామని, దీనివల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. దీనివల్ల కేంద్రం నుంచి భారీగా నిధులు వస్తాయన్నారు. 

ఏకో టూరిజం, లైవ్లీ వుడ్ పెంపొందించి అటవీ సమీప గ్రామాల ప్రజలకు ఉపాధి మెరుగుపర్చేందుకు దోహదపడుతుందని వివరించారు. అడవుల సంరక్షణ, వన్యప్రాణులు, పులుల సంరక్షణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే అవకాశముంటుందని వెల్లడించారు. పదేండ్లుగా ఈ ప్రక్రియకు సంబంధించి ప్రజలతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని స్పష్టం చేశారు. కన్జర్వేషన్ రిజర్వ్​కారిడార్ పరిధిలోకి 339 గ్రామాలు వస్తాయన్నారు. టైగర్ జోన్, కన్జర్వేషన్ రిజర్వ్​ను ఆదివాసీలు, ప్రజలు వ్యతిరేకించొద్దని, దీనిద్వారా జరిగే మంచిని గుర్తించాలని సూచించారు.