కాగజ్నగర్లో మళ్లీ కనిపించిన పెద్దపులి

కాగజ్నగర్లో మళ్లీ కనిపించిన పెద్దపులి
  • వంజీరిలోని రైల్వేగేటు దగ్గర ఉదయం కనిపించిన పెద్దపులి
  • 35 ట్రాప్ కెమెరాలు,50 ట్రాకర్స్తో కొనసాగుతున్న సెర్చింగ్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి జాడ కనిపెట్టేందుకు అటవీశాఖ అధికారులు గాలింపు ముమ్మరం చేశారు. 35 ట్రాప్ కెమెరాలు.. 50 ట్రాకర్స్ తో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. నిన్న రాత్రి కాగజ్ నగర్ టౌన్ లో కనిపించిన పులి.. నేడు వంజీరిలోని రైల్వేగేటు దగ్గర గేట్ మెన్ కు కనిపించింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు పెద్దపులి జాడ కోసం గాలింపు చేపట్టారు.

పెద్ద పులి పాదముద్రల ఆధారంగా గాలించగా.. అది పెద్దవాగు తీర ప్రాంతం వైపు వెళ్లినట్లు గుర్తించారు. పరిసర ప్రాంతాలైన శివాపూర్, బారెగూడ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అటవీ శాఖ అధికారి దినేష్ కుమార్, కాగజ్ నగర్ డివిజన్ ఆఫీసర్ విజయ్ కుమార్ కోరారు. పెద్దపులి  సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు.