మహబూబాబాద్ జిల్లాలో ఉచ్చులతో దుప్పిని చంపిన వేటగాళ్లు..మాంసం స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు

మహబూబాబాద్  జిల్లాలో ఉచ్చులతో దుప్పిని చంపిన వేటగాళ్లు..మాంసం స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు

గూడూరు, వెలుగు: మహబూబాబాద్  జిల్లా గూడూరు అటవీ ప్రాంతంలో వేటగాళ్లు ఉచ్చులు ఏర్పాటు చేసి చుక్కల దుప్పిని హతమార్చారు. వన్యప్రాణుల మాంసం అమ్ముతున్నారనే సమాచారంతో ఎఫ్ఆర్వో ప్రసాదరావు సిబ్బందితో కలిసి గుంజేడు సమీపంలోని బుగ్గచెలిమె ప్రాంతానికి చేరుకోగా, వేటగాళ్లు బైక్​లు, దుప్పి మాంసం వదిలేసి పరారయ్యారు. వాటిని స్వాధీనం చేసుకొని గూడూరు రేంజ్  ఆఫీస్ కు తరలించారు. వాహనాల రిజిస్ట్రేషన్​ ఆధారంగా వరంగల్  జిల్లా ఖానాపురం మండలం నాజి తండాకు చెందిన జాటోత్  రమేశ్, భూక్య మోహన్, భూక్య నాగేంద్రగా గుర్తించినట్లు ఎఫ్ఆర్వో తెలిపారు. నిందితులను పట్టుకొని చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పారు.