రూ.93 వేల కోట్లు తగ్గిన ఫారెక్స్ నిల్వలు.. యుద్ధం కారణంగా 688 బిలియన్ డాలర్లకు తగ్గుదల

రూ.93 వేల కోట్లు తగ్గిన ఫారెక్స్ నిల్వలు.. యుద్ధం కారణంగా 688 బిలియన్ డాలర్లకు తగ్గుదల

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఫిబ్రవరి చివరిలో రికార్డ్ లెవెల్ (728.494 బిలియన్‌‌‌‌ డాలర్ల)కు  చేరిన భారత ఫారెక్స్‌‌‌‌ నిల్వలు, ఇరాన్‌‌‌‌ యుద్ధం ప్రభావంతో వరుసగా తగ్గుతూ, మార్చి 27తో ముగిసిన  వారంలో  688.05 బిలియన్‌‌‌‌ డాలర్లకు  పడిపోయాయి. ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్‌‌‌‌సీఏ), బంగారం విలువ తగ్గగా, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌‌‌‌డీఆర్‌‌‌‌‌‌‌‌), ఇంటర్నేషనల్ మానిటరి ఫండ్ (ఐఎంఎఫ్‌‌‌‌) వద్ద నిల్వలు స్వల్పంగా పెరిగాయి. కిందటి నెల 27తో ముగిసిన వారంలో ఫారెక్స్‌‌‌‌ నిల్వలు 10.28 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.93 వేల కోట్లు) తగ్గి 688.05 బిలియన్ డాలర్లకు చేరాయి.

అంతకు ముందు వారంలో నిల్వలు 11.413 బిలియన్ డాలర్లు తగ్గి 698.346 బిలియన్‌‌‌‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఎఫ్‌‌‌‌సీఏ  నిల్వలు 6.622 బిలియన్ డాలర్లు తగ్గి 551.072 బిలియన్‌‌‌‌ డాలర్లకు చేరాయి. ఇవి యూరో, పౌండ్, యెన్ వంటి కరెన్సీల విలువల్లో  మార్పులను కూడా ప్రతిబింబిస్తాయి.

గోల్డ్ నిల్వలు 3.666 బిలియన్ డాలర్లు తగ్గి 113.521 బిలియన్‌‌‌‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఎస్‌‌‌‌డీఆర్‌‌‌‌‌‌‌‌లు 17 మిలియన్ డాలర్లు పెరిగి 18.649 బిలియన్‌‌‌‌ డాలర్లకి, ఐఎంఎఫ్‌‌‌‌ వద్ద రిజర్వ్ పొజిషన్‌‌‌‌17 మిలియన్ డాలర్లు పెరిగి 4.816 బిలియన్‌‌‌‌ డాలర్లకు చేరాయి.