ఆర్మూర్ లో కన్న బిడ్డే రోడ్డుపై వదిలేసిండు..

ఆర్మూర్ లో  కన్న బిడ్డే  రోడ్డుపై వదిలేసిండు..

ఆర్మూర్, వెలుగు : మానవత్వం మరిచి ఓ వృద్ధురాలిని కుటుంబీకులే రోడ్డుపై వదిలేసిన ఘటన ఆర్మూర్​లో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఆర్మూర్​ పట్టణానికి చెందిన ఓ వృద్ధురాలు(70) రెక్కలు ముక్కలు చేసుకుని ఒక్కగానొక్క కొడుకును సాకి పెండ్లి చేసింది.  కొన్ని సంవత్సరాలు సంసారం సాఫీగా సాగింది. ఏడాది కాలంగా వృద్ధురాలి మానసిక పరిస్థితి బాగాలేదు. 

నిరుపేద కుటుంబం కావడంతో వైద్యం చేయించలేక కుటుంబీకులు ఆర్మూర్​తహసీల్దార్ ఆఫీస్​ సమీపంలో వారం రోజుల కింద వదిలేసి వెళ్లారు. చలి తీవ్రతకు గజగజ వణుకున్న ఆమె దీనస్థితిని చూసి ఓ దాత రగ్గు ఇవ్వగా కప్పుకుని రోడ్డు వెంట తిరుగుతోంది. ఎక్కడికి వెళ్లాలో తెలియక కన్నీళ్లు పెడుతోంది. అధికారులు స్పందించి ఏదైనా వృద్ధాశ్రమంలో వేయాలని స్థానికులు కోరుతున్నారు.