
దండేపల్లి, వెలుగు: వికసిత్ భారత్ లో ప్రతిఒక్కరూ భాగస్వాములవ్వాలని బీజేపీ మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ కోరారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం దండేపల్లి మండలం కేంద్రంలో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రజలందరూ తమ ఇండ్లపై జెండాలు ఎగురవేయాలని సూచించారు.
ఎందరో మహనీయులు త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, ప్రధాని మోదీ వికసిత్ భారత్ దిశగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు బందెల రవిగౌడ్, మాజీ అధ్యక్షుడు గోపతి రాజయ్య, నాయకులు పత్తిపాక సంతోష్, ముత్తె అనిల్, యువ మోర్చా కన్వీనర్ ఎంబడి దిలీప్, నాయకులు పాల్గొన్నారు.