బీజేపీకి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా

బీజేపీకి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా

మాజీ మంత్రి, సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేశారు. గుంటూరులోని తన నివాసంలో ముఖ్య అనుచరులతో సమావేశమైన అనంతరం ఆయన తన రాజీనామాను ప్రకటించారు. కన్నాతో పాటు ఆయన అనుచరులు కూడా పార్టీని వీడనున్నట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా భాజపా రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ.. ఫైనల్ గా నేడు పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు. దీంతో ఆయన  తదుపరి భవిష్యత్ కార్యాచరణపై చర్చ మొదలైంది. కన్నా నెక్స్ట్ ఏ పార్టీలో చేరబోతున్నారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతమైతే కన్నా... జనసేన లేదా టీడీపీలో జాయిన్ అవుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఆయన ఇప్పుడే క్లారిటీ ఇస్తారా లేదంటే మరికొంత సమయం తీసుకుంటారా అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. కాగా తన కారుకున్న బీజేపీ జెండాను సైతం కన్నా తొలగించారు.