
కొమురవెల్లి: కొమురవెల్లి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు పడిగన్నగారి మల్లప్ప(82) బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయాడు. మల్లప్ప 50 ఏళ్లు మల్లికార్జునస్వామి సన్నిధిలో అర్చకుడిగా విధులు నిర్వహించారు. 2009లో ఉద్యోగ విరమణ పొందారు. మల్లప్పకు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.