కేసీఆర్ కు మతి భ్రమించింది

కేసీఆర్ కు మతి భ్రమించింది

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై దాడి చాలా దుర్మార్గమైన  చర్య అన్నారు ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్. తన అనుభవంలో ఒక పార్లమెంటు సభ్యుని కార్యాలయం తలుపులు పగులగొట్టి దాడి చేయడం మొదటి సారి చూశానన్నారు. కేసీఆర్ కు సిగ్గుంటే ఇప్పటికైనా దాడి చేసిన పోలీసు అధికారులపై కేసులు నమోదు చేసి సస్పెండ్ చేయాలన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి పోయే కాలం ఆసన్నమైందన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై పోరాడేందుకు బీజేపీ సంసిద్ధంగా ఉందన్నారు రమణ్ సింగ్. వెనకడుగు వేసే సమస్య లేదన్నారు. బండి సంజయ్ అరెస్టుతోనే టీఆర్ఎస్ పార్టీ తన పతనానికి పునాది వేసుకుందన్నారు. తెలంగాణలో నిజాం తరహా పరిపాలన సాగుతోందని విమర్శించారు. మహిళల పట్ల కూడా పోలీసులు కర్కశంగా వ్యవహరించారన్నారు. కోట్లు ఖర్చు పెట్టినా హుజురాబాద్ లో ఓటమి ఎదురు కావడంతోనే  ముఖ్యమంత్రి కేసీఆర్ కు మతి భ్రమించిందన్నారు. తెలంగాణను తన జాగీరుగా చేసుకొని కేసీఆర్ కుటుంబపాలన చేస్తున్నాడన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన తెలంగాణ ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదన్నారు రమణ్ సింగ్.

ఇవి కూడా చదవండి: 

వనమా రాఘవను అరెస్ట్ చేసిన కొత్తగూడెం పోలీసులు

ఎంపీ అని కూడా చూడకుండా కొట్టారు