
ముంబై : ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రదీప్‌శర్మ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. ముంబైలోని నాలాసోపారా టిక్కెట్ ను శివసేన ఆయనకు కేటాయించింది. 1983 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ప్రదీప్‌శర్మ గత ఏడాది వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన తన పేరున, భార్యపేరున రూ. 36.21 కోట్ల ఆస్తులున్నట్టు పేర్కొన్నారు. ఈనెల 21న జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రదీప్ శర్మతో పాటు షమ్షేర్ ఖాన్ పఠాన్, గౌతమ్ గైక్వాడ్ అనే మరో ఇద్దరు పోలీసు ఆఫీసర్లు కూడా ఎన్నికల బరిలో ఉన్నారు.