52వ టెస్టులో 50.. 104వ టెస్టులో 48.. ఏంటి ఇది కోహ్లీ..?

52వ టెస్టులో 50.. 104వ టెస్టులో 48.. ఏంటి ఇది కోహ్లీ..?

బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు సిరీస్లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చెత్త రికార్డును మూట కట్టుకున్నాడు. ఈ సిరీస్లో దారుణంగా విఫలమైన కోహ్లీ.. గత 10 టెస్టు ఇన్నింగ్స్లో ఒక్క అర్థ సెంచరీ కూడా చేయలేకపోయాడు. రెండు  ఇన్నింగ్స్‌ల్లో 45 పరుగులే చేశాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో 1, 19 పరుగులు మాత్రమే చేశాడు. ఇక రెండో టెస్టులోనూ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 24 పరుగులు చేయగా.. కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో ఒకే పరుగు చేసి కష్టాల్లో ఉన్నప్పుడు ఔటయ్యాడు. 

టెస్టుల్లో వరుసగా విఫలమవుతున్న కోహ్లీ బ్యాటింగ్ సగటు 50 కంటే దిగువకు పడిపోయింది. ప్రస్తుతం 104 టెస్టుల్లో 27 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు చేశాడు. మొత్తం 8,119 పరుగులు సాధించాడు. కోహ్లీ తన 52వ టెస్టుల్లో యావరేజ్ 50కి పైగా ఉంది. అయితే ఇప్పుడు మాత్రం 48.91 సగటుకు పడిపోయింది. వన్డేల్లో కోహ్లీ సగటు 57.47 గా ఉండగా..టీ20ల్లో 52.74గా ఉంది. 

కోహ్లీ 2014లోనూ వరుసగా పది ఇన్నింగ్స్ లో విఫలమయ్యాడు. అప్పుడు కూడా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో కోహ్లీ అత్యధిక వ్యక్తిగత స్కోరు 39 పరుగులే. అయితే  ఆసియాకప్ ద్వారా ఫాంలోకి వచ్చిన కోహ్లీ...అంతకుముందు ఫాం లేమితో తంటాలు పడ్డాడు. ఆసియాకప్ తో పాటు టీ20 వరల్డ్ కప్ లోనూ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. అయితే బంగ్లాతో జరిగిన టెస్టు సిరీస్ లో మాత్రం విఫలమవడం అభిమానులను కలవరపెడుతోంది.