ఐపీఎల్ 19లో భాగంగా మంగళవారం (ఏప్రిల్ 14) చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు అందరి కళ్లు చెన్నై స్టార్ ప్లేయర్ సంజు శాంసన్‌పైనే ఉన్నాయి. ఈ సీజన్‌ను పేలవంగా ఆరంభించిన సంజు ఢిల్లీ క్యాపిటల్స్‌పై సెంచరీతో చెలరేగి తన సత్తా ఏంటో మరోసారి చూపించాడు. చెటా సెంచరీతో ఈ సీజన్లో చెన్నై తొలి విజయాన్ని నమోదు చేసింది.
సెంచరీతో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన సంజు శాంసన్‌ను కట్టడి చేసేందుకు కేకేఆర్ ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో సంజును త్వరగా ఎలా ఔట్ చేయొచ్చొ కేకేఆర్‌కు సలహా టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. కేకేఆర్ స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఆడటానికి సంజు ఇబ్బంది పడతాడని.. నరైన్ బౌలింగ్‌లో ఇప్పటికే అతడు మూడు సార్లు ఔట్ అయ్యాడని గుర్తు చేశారు. నరైన్ బౌలింగ్‌లో సంజు దాదాపు 80 బంతులు ఎదుర్కొగా స్ట్రైక్ రేట్ కేవలం 80 మాత్రమే ఉందని అతని బలహీనతను బయటపెట్టాడు.
నరైన్ బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడేందుకు కూడా శాంసన్ ఎక్కువగా రిస్క్ చేయడని పేర్కొన్నారు. ఇవాళ్టి మ్యాచులో కేకేఆర్ నరైన్‌ను ఎంత తొందరగా బౌలింగ్‌కు తీసుకువస్తే శాంసన్‌ను అంత త్వరగా ఔట్ చేయొచ్చని సూచించాడు. అయితే, చెపాక్ పిచ్‌పై బౌన్స్ ఎక్కువగా ఉండటంతో బ్యాటర్లు భారీ స్కోర్లు చేసే అవకాశం ఉందని.. మరీ సంజు ఎలా ఆడతాడో చూడాలన్నారు ఇర్ఫాన్.
ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ జట్లుగా పేరున్న చెన్నై, కోల్‌కతా ఈ సీజన్‌ను అతి దారుణంగా ఆరంభించాయి. ఇరు జట్లు ఆడిన తొలి మ్యాడు మ్యాచుల్లో ఓటమి పాలయ్యాయి. రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలోని సీఎస్‌కే నాలుగో మ్యాచ్‌లో ఎట్టకేలకు డీసీపై విజయం సాధించాయి టోర్నీలో బోణీ కొట్టింది.
ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు ఓడిపోగా.. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అవడంతో ఈ టోర్నీలో కేకేఆర్ ఇంకా విజయాల ఖాతా తెరవలేదు. దీంతో చెన్నైపై గెలిచైనా బోణీ కొట్టాలని కేకేఆర్ భావిస్తోంది. మరోవైపు గెలుపు జోష్‌లో ఉన్న సీఎస్కే సొంతగడ్డపై కేకేఆర్‌ను చిత్తు చేసి టోర్నీలో రెండో విజయం నమోదు చేయాలని చూస్తోంది.

