
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 19 ఏళ్ల వయస్సులో 2002లో ఇంగ్లండ్ టూర్‌లో ఇంటర్నేషనల్ మ్యాచుల్లో అరంగేట్రం చేసిన పార్థివ్.. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికాడు. తన రిటైర్మెంట్ గురించి ఓ ట్వీట్‌లో తెలిపాడు. భారత్ తరఫున 25 టెస్టుల్లో ఆడిన పార్థివ్.. 39 వన్డేలు, రెండు టీ20ల్లోనూ మెన్ ఇన్ బ్లూకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 934 రన్స్, వన్డేల్లో 736 పరుగులు, టీ20ల్లో 36 రన్స్ చేశాడు. టీమిండియా తరఫున 2018, జనవరిలో చివరి మ్యాచ్ ఆడాడు.
— parthiv patel (@parthiv9) December 9, 2020