లోక్ సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి శుక్రవారం (ఫిబ్రవరి 23) గుండెపోటుతో ముంబై ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బుధవారం ముంబైలోని హిందూజా ఆస్పత్రిలోని ఐసీయూలో చేరారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. 2023 మేలో బ్రెయిన్ హెమరేజ్ తో బాధపడుతూ ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందారు.
జోషి 1995 నుంచి 1999 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. బాల్ థాకరే శివసేన పార్టీలో కీలక నేత. మనోహర్ జోషి 2002 నుంచి 2004 వరకు లోక్ సభ స్పీకర్ గా ఉన్నారు.
