దిగ్విజయ సింగ్ కారుకు యాక్సిడెంట్

దిగ్విజయ సింగ్ కారుకు యాక్సిడెంట్

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కారుకు ప్రమాదం ఎదురయింది. రాజ్ గఢ్ నుంచి వెళ్తున్న దిగ్విజయ్ సింగ్ కారు ఓ బైక్ ను ఢీ కొట్టింది. దాంతో బైకర్ రాంబాబు బగ్రీ (20) బైక్ మీదనుంచి ఎగిరి పడ్డాడు. అయితే, ఈ యాక్సిడెంట్ వల్ల రాంబాబుకు పెద్దగా గాయాలేవీ జరగలేదని, ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.

యాక్సిడెంట్ దృశ్యాలన్నీ పక్కనే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. సింగిల్ రోడ్డుపై బైక్ పై వెళ్తున్న రాంబాబు.. ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాడు. దాంతో స్పీడ్ గా వస్తున్న దిగ్విజయ్ సింగ్ కారు బైక్ ను ఢీ కొట్టింది. వెంటనే దిగ్విజయ్ సింగ్ కారు దిగి రాంబాబును పరిశీలించారు. తర్వాత తన కారులోనే హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. రాంబాబును పరిశీలించిన డాక్టర్ మనోజ్ గుప్తా..  బైకర్ తలకు చిన్న గాయం అయింది. దానివల్ల పెద్ద ప్రామాదం ఏమీ లేదు. సీటీ స్నాన్ చేశామని తెలిపాడు.