కాంగ్రెస్ బిగ్ షాక్.. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ రాజీనామా

కాంగ్రెస్ బిగ్ షాక్.. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ రాజీనామా

లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర నేత అశోక్ చవాన్ కాంగ్రెస్ రాజీనామా చేశారు. ఫిబ్రవరి 12వ తేదీ సోమవారం తాను కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మహారాష్ట్ర పీసీసీ చీఫ్‌ నానా పటోలేకు ఆయన తన రాజీనామా లేఖను పంపించారు. 

కాంగ్రెస్‌కు రాజీనామా చేయడానికి కారణాలను త్వరలో వెల్లడిస్తానని.. రెండు మూడు రోజులు తన భవిష్యత్‌ కార్యాచరణ వెల్లడిస్తానని చవాన్ తెలిపారు.కాగా, ఆయన త్వరలో బీజేపీలో పార్టీలో చేరబోతున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. 

ఇటీవల కాంగ్రెస్ మరో సీనియర్ నేత మిలింద్ దేవరా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఒక్కొక్కరుగా సీనియర్ నేతలు ఎవరి దారి వారు చూసుకుంటూ పార్టీ నుంచి వెళ్లిపోతుండడంతో మహారాష్ట్రలో కాంగ్రెస్ గ్రాస్ పడిపోతోంది.