
ముంబై: మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అరెస్ట్ అయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. దేశ్‌ముఖ్‌ను సుమారు 12 గంటల పాటు ఈడీ అధికారులు విచారించినట్లు తెలుస్తోంది. మనీ లాండరింగ్ కేసులో ఇది వరకే ఆయన విచారణను ఎదుర్కొన్నారు. రూ.100 కోట్ల దాకా మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు అనిల్ దేశ్‌ముఖ్‌పై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ ఆయన్ను విచారిస్తోంది. ఇవ్వాళ ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అనిల్ దేశ్‌ముఖ్‌ను కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానాన్ని ఈడీ కోరనుంది.