టికెట్ మార్చకపోతే బీఆర్ఎస్ కు పుట్టగతులుండవు: రామచంద్రారెడ్డి

టికెట్ మార్చకపోతే బీఆర్ఎస్ కు పుట్టగతులుండవు: రామచంద్రారెడ్డి

వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన మెతుకు ఆనంద్ ని మార్చాలని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థికి ఇచ్చిన టికెట్ మార్చాలని.. లేకపోతే బీఆర్ఎస్ కు పుట్టగతులుండవని హెచ్చరించారు. 

పట్టణంలోని బసంత్ పంక్షన్ హాల్ లో అసమ్మతి నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరైయ్యారు. మెతుకు ఆనంద్ కు బదులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారు ఎవరినైనా బీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.   

మెతుకు ఆనంద్ ను మార్చకపోతే ఖచ్చితంగా ఓడిస్తామని అసమ్మతి నేతలు ఫైర్ అయ్యారు. ఒకవేళ అభ్యర్థిని మార్చకపోతే రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో ఓడించి.. కేసీఆర్ కు గిఫ్టుగా ఇస్తా్మని హెచ్చరించారు.