కేసీఆర్ కు ఫామ్ హౌజ్ నుంచి సెక్రటేరియట్ డిజైన్ చేయడం ముఖ్యమా…కరోనా నుంచి ప్రజల ప్రాణాలు కాపాడడం ముఖ్యమా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి డీకే అరుణ. రాష్ట్రంలో కరోనా వైరస్‌తో ప్రజలు అల్లాడుతుంటే ఇంత ఆఘమేఘాల మీద సచివాలయం కూల్చివేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. సచివాలయం కూల్చివేత కేసీఆర్ ప్రభుత్వ ఉన్మాద చర్యగా దుయ్యబడుతూ.. ప్రజల ఆరోగ్యం కంటే కేసీఆర్ కు సచివాలయం నిర్మాణమే ముఖ్యమా? అని అన్నారు.
ఒక్క రోజు కూడా కేసీఆర్ సచివాలయానికి వెళ్ళలేదని, నూతన సచివాలయం ఎందుకని ప్రశ్నించారు. ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేమని జీతాలలో కోత పెట్టిన ప్రభుత్వం సచివాలయం ఎలా కడతారన్నారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సచివాలయాన్ని కోవిడ్ ఆస్పత్రి గా మార్చండని డిమాండ్ చేశారు.
