కేవీకే ను సందర్శించిన నెదర్లాండ్​ మాజీ మంత్రి థియోవాన్ డీ సాండే

కేవీకే ను సందర్శించిన నెదర్లాండ్​ మాజీ మంత్రి థియోవాన్ డీ సాండే

గరిడేపల్లి, వెలుగు : నెదర్లాండ్స్ మాజీ మంత్రి, మినిస్ట్రీ ఫర్ డెవల్​మెంట్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్​ థియోవాన్ డీ సాండే గురువారం గడ్డిపల్లి కేవీకే ను సందర్శిచారు. నెదర్లాండ్స్ ప్రభుత్వం గడ్డిపల్లి కేవీకేలో పరిశోధన, విస్తరణ ప్రాజెక్టులకు మద్దతిచ్చింది. కేవీకేలోని డెమో యూనిట్లను ఆయన పరిశీలించారు.  కేవీకేలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమాలు, లబ్ధిపొందిన రైతులతో మాట్లాడి అనుభవాలు తెలుసుకున్నారు. 

ఆయన వెంట కేవీకే సెక్రటరీ స్నేహలత, డైరెక్టర్ ఘంటా అమరేందర్ రెడ్డి, ఇన్ చార్జి ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డి.నరేశ్, కేవీకే శాస్త్రవేత్తలు సీహెచ్ నరేశ్, ఆదర్శ్, కిరణ్, మాధురి, ఆఫీసు సిబ్బంది, రైతులు ఉన్నారు.