
సూర్యాపేట, వెలుగు: మాజీ మంత్రి,సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి అస్థికలను కృష్ణా నది త్రివేణి సంగమంలో నిమజ్జనం చేశారు. ఆదివారం వాడపల్లి క్షేత్రానికి వెళ్లిన ఆయన కొడుకు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, కుటుంబ సభ్యులు అర్చకుల వేదమంత్రోచ్ఛరణల నడుమ శాస్ర్తోక్తంగా కృష్ణా, మూసీ, తుంగభద్ర నదులు కలిసే ప్రాంతంలో అస్థికలు నిమజ్జనం చేశారు. దామోదర్ రెడ్డి సోదరులు గోపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి, మేనల్లుడు జెన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పోతు భాస్కర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, నేతలు కోతి గోపాల్ రెడ్డి, అంజద్ అలీ, కరుణాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.