మహబూబాబాద్, వెలుగు: ఈ నెల 29న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే దీక్షా దివాస్ను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. గురువారం మానుకోట బీఆర్ఎస్ జిల్లా ఆఫీస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ నవంబర్ 29 న దీక్ష తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నట్లు గుర్తుకు చేశారు.
జిల్లా పార్టీ ఆఫీస్‌లో 29న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు దీక్షా దివాస్ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, మాజీ జడ్పీ చైర్మన్ ఆంగోతు బిందు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
