రైతులకు అండగా ఉంటాం : మాజీ మంత్రి జీవన్ రెడ్డి 

రైతులకు అండగా ఉంటాం : మాజీ మంత్రి జీవన్ రెడ్డి 

రాయికల్​, వెలుగు: అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేస్తామని రైతులు అధైర్యపడొద్దని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. రాయికల్ మండలంలోని బోర్నపల్లి గ్రామంలో సోమవారం ఆయన పర్యటించారు. అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని రైతులతో కలిసి పరిశీలించారు. వర్షాలు వచ్చేలా ఉన్నందున లారీలు తెప్పించి వెంటనే ధాన్యాన్ని మిల్లులకు తరలించాలన్నారు.  

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సన్న వరి సాగుకు ప్రభుత్వం రూ.500 బోనస్ అందించి ప్రోత్సహిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి, కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి గుర్రం మహేందర్ గౌడ్, కాంగ్రెస్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కొడిపెళ్లి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.