వేణుగోపాలస్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

వేణుగోపాలస్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

మక్తల్, వెలుగు: మక్తల్‌‌‌‌‌‌‌‌ పట్టణం యాదవ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని శ్రీ వేణుగోపాల స్వామిని ఆదివారం మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేను ఆలయ అర్చకుడు వెంకన్న శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. 

నిర్వాహకులు డాక్టర్ శ్రీరాములు, కావలి శ్రీహరి ఆయనను శాలువాతో ప్రత్యేకంగా సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ నరసింహ గౌడ్, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు చిన్నహనుమంతు, మొగులప్ప,  శంకర్, అశోక్ కుమార్ గౌడ్, అమ్రేశ్‌‌‌‌‌‌‌‌, నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.