- మంత్రి వివేక్ వెంకటస్వామిని కోరిన మాజీ ఎమ్మెల్యే నారాయణ్ రావు పటేల్
భైంసా, వెలుగు: ముథోల్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎస్ఆర్, డీఎంఎఫ్ టీ నిధులు ఇవ్వాలని కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని మాజీ ఎమ్మెల్యే నారాయణ్ రావు పటేల్కోరారు. సోమవారం హైదరాబాద్లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో రోడ్లు, ఇతర అభివృద్ధి పనుల కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇందుకు మంత్రి వివేక్సానుకూలంగా స్పందించారని, నిధుల విడుదలకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు నారాయణ్ రావు పటేల్ తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
