మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ క్యాంప్ కార్యాలయం సీజ్

మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ క్యాంప్ కార్యాలయం సీజ్

నాగార్జునసాగర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఉండే క్యాంప్ కార్యాలయాన్ని ఎన్ఎస్పీ అధికారులు సీజ్ చేశారు.  దీంతో బీఆర్ఎస్ నాయకులు క్వార్టర్స్ ముందు బైఠాయించి ధర్నా చేస్తున్నారు.  భగత్ తండ్రి నోముల నర్సింహ్మయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పడు ఆయనకు క్వార్టర్స్ అలాట్ చేశారు ఎన్ఎస్పీ అధికారులు.  అయితే ఇప్పుడు క్వార్టర్స్ ఖాళీ చేయాలంటూ వారం కిందట భగత్ కు నోటీసులు ఇచ్చిన రెవిన్యూ అధికారులు. 

నోటీసులకు తాను సమాధానం ఇచ్చానని.. అయినప్పటికీ  తనకు సమాచారం ఇవ్వకుండానే తన సామాన్లను ఖాళీ చేసి బయట పడేసారని భగత్ ఆరోపిస్తున్నారు.  మాజీ ఎమ్మెల్యే జానారెడ్డి సహ ఇతర పార్టీల నేతలకు క్వార్టర్స్ కేటాయించారని..  వారికి లేని అభ్యంతరం తన విషయంలో  ఎందుకని భగత్ ప్రశ్నిస్తున్నారు.  రెవిన్యూ అధికారుల వైఖరిని నిరసిస్తూ.. పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళనకు సిద్దమైన భగత్ ను  అనుముల మండలం ఆలీనగర్ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు.  

ALSO READ :- Layoffs : ఫోన్లు చేసి ఉద్యోగాలు పీకేస్తున్న బైజూస్