కేంద్ర ప్రభుత్వం  కుట్రలను తిప్పికొడదాం : మాజీ ఎంపీ సోయం బాపురావు

కేంద్ర ప్రభుత్వం  కుట్రలను తిప్పికొడదాం : మాజీ ఎంపీ సోయం బాపురావు

బజార్ హాత్నూర్, వెలుగు:  తెలంగాణపై కేంద్రం చేస్తున్న కుట్రలను తిప్పి కొడతామని మాజీ ఎంపీ సోయం బాపురావు పిలుపునిచ్చారు. బజార్ హత్నూర్ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  దేగామ గ్రామం నుంచి మండలకేంద్రం వరకు కాంగ్రెస్ లీడర్లతో కలిసి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ పేరిట చేస్తున్న ప్రయత్నాలు రిజర్వేషన్లకు ముప్పు తీసుకొస్తున్నాయన్నారు.

బీఆర్‌‌ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే ఇప్పటికీ బడుగు, బలహీన వర్గాల ప్రజలకు రిజర్వేషన్లు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో నిధుల కొరత ఉన్నప్పటికీ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ బోథ్ ఇన్‌చార్జి ఆడే గజేందర్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జి ఆత్రం సుగుణ, లీడర్లు బొడ్డు గంగారెడ్డి, సత్యవతి, జల్కే పాండురంగ్, మల్లెపూల నరసయ్య, మునేశ్వర్ నారాయణ పాల్గొన్నారు.