ఆడి ఆడి అలిసిపోయా.. క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఆర్‌సీబీ మాజీ స్పిన్నర్‌

ఆడి ఆడి అలిసిపోయా.. క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఆర్‌సీబీ మాజీ స్పిన్నర్‌

ఆర్‌సీబీ మాజీ క్రికెటర్, ముంబై లెఫ్టార్మ్ స్పిన్నర్ ఇక్బాల్ అబ్దుల్లా 33 ఏళ్ల వయసులో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన క్రికెట్ ప్రయాణం ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్న అబ్దుల్లా.. తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అతడు తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.

2008 అండర్-19 వరల్డ్ కప్‌ గెలిచిన భారత జట్టులో సభ్యుడు.. అబ్దుల్లా. 2009-10, 2012-13, 2015-16 రంజీ సీజన్లలో ముంబై జట్టు విజేతగా  నిలవడంలోనూ అతడు కీలక పాత్ర పోషించాడు. ఆ ప్రదర్శనలు అతనికి ఐపీఎల్‌లో మరిన్ని అవకాశాలు కల్పించాయి. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్తాన్‌ రాయల్స్‌ తరపున ఆడిన అబ్దుల్లా.. దేశవాళీ క్రికెట్‌లో మిజోరం, సిక్కిం, కేరళ, ఉత్తరాఖండ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. 

2007 రంజీ సీజన్‌లో ముంబై తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసిన అబ్దుల్లా.. మొత్తంగా 71 మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో 2641 పరుగులతో పాటు 220 వికెట్లు తీశాడు. ఇక లిస్ట్‌-ఎ క్రికెట్‌లో 131 వికెట్లతో పాటు 1196 పరుగులు చేశాడు. 

  • 2011-12 దేశవాళీ సీజన్‌లో బెస్ట్ ఆల్-రౌండర్
  • 2011 ఐపీఎల్ సీజన్ లో రైజింగ్ క్రికెటర్ అవార్డు
  • 2011 ఇంగ్లాండ్ పర్యటనలో మ్యాన్ ఆఫ్ ద సిరీస్(ఇండియా ఏ జట్టు)