
తన వ్యక్తిగత జీవితం గురించి చెప్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్ధుల్ రజాక్. తాజాగా ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ… తనకు ఐదారుగురితో వివాహేతర సంబంధాలు ఉండేవని తెలిపారు. అది కూడా తనకు పెండ్లి అయ్యాకే అని చెప్పారు. అయితే అవి చాలా ఏండ్లు నడవలేవని అన్నారు. ఒకరితో ఏడాదిన్నర.. మరొకరితో రెండు సంవత్సరాలు మాత్రమే కొనసాగించినట్లు తెలిపాడు.
బీసీసీఐ ఊ అంటే హార్ధిక్ ను ప్రపంచ స్థాయి ఆల్ రౌండర్ ను చేస్తా…
బీసీసీఐ ఒప్పుకుంటే హర్థిక్ పాండ్యాకు కోచింగ్ ఇస్తానని తెలిపాడు అబ్ధుల్ రజాక్. పాండ్యా ను ప్రపంచ స్థాయి ఆల్ రౌండర్ ను చేసే సత్తా తనలో ఉందని అన్నాడు. పాండ్యా బాల్ ను విసిరేటప్పుడు కొన్ని తప్పులు చేస్తున్నట్లు చెప్పాడు. పాండ్యాకు కోచింగ్ ఇస్తే గొప్ప ప్లేయర్ అవుతాడని చెప్పాడు.