నాచుపల్లి జేఎన్టీయూలో అర్ధరాత్రి విద్యార్థుల ధర్నా

 నాచుపల్లి జేఎన్టీయూలో అర్ధరాత్రి విద్యార్థుల ధర్నా
  • సీఎస్​వో సస్పెన్షన్​ 

కొడిమ్యాల, వెలుగు: నాచుపల్లి జేఎన్టీయూలో హాస్టల్ విద్యార్థులు శుక్రవారం అర్ధరాత్రి ధర్నాకు  దిగారు. సీఎస్ వో రాజిరెడ్డి ప్రతీరోజు మద్యం మత్తులో వస్తూ తమను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆరోపించారు. అర్ధరాత్రి అతన్ని నిర్బంధించి ఆందోళన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ అక్కడికి చేరుకొని సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు.

దీంతో ఆయన​ కూడా సీఎస్ వోకే సపోర్ట్ చేస్తున్నారని, వైస్ ప్రిన్సిపాల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సుమారు 3 గంటలపాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చివరకి సీఎస్ వోపై చర్యలు తీసుకుంటామని  చెప్పడంతో శాంతించారు. అనంతరం సీఎస్​వోను ప్రిన్సిపాల్​ నరసింహ సస్పెండ్​ చేశారు.