నేను కాంగ్రెస్ పార్టీ కాబట్టే టీఆర్ఎస్ సర్పంచ్ వేధిస్తుండు

నేను కాంగ్రెస్ పార్టీ కాబట్టే టీఆర్ఎస్ సర్పంచ్ వేధిస్తుండు

జగిత్యాల: తన హయాంలో నిర్మించిన  స్మశాన వాటికకు సంబంధించి 2 లక్షల రూపాయల బిల్లులు ఇవ్వకుండా ప్రస్తుత సర్పంచి వేధిస్తున్నాడని ఆరోపిస్తూ మాజీ సర్పంచ్ కొసరి మహేష్ గ్రామ పంచాయతీ ఆఫీసుకు తాళం వేశారు. రాయికల్ మండలం తట్లవాయి  గ్రామపంచాయితీ కార్యాలయానికి తాళం వేసిన ఆందోళన చేపట్టాడు మాజీ సర్పంచి కొసరి మహేష్. 2018కి ముందు తన హయాంలో నిర్మించిన  స్మశాన వాటికకు సంబంధించి రూ. 2లక్షల రూపాయల బిల్లులు పెండింగులో పెట్టారని.. తన బిల్లులు అకౌంట్ లో పడినా ఇవ్వడంలేదని.. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకుండా ప్రస్తుత సర్పంచి వేధిస్తున్నాడని ఆరోపించారు. తనది కాంగ్రెస్ పార్టీ  కాబట్టే ఇప్పుడున్న టిఆర్ఎస్ సర్పంచ్ ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు మాజీ సర్పంచ్ మహేష్.

 

 

ఇవి కూడా చదవండి

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

RRR ఓ మాస్టర్ పీస్.. ఆ మూవీ ఒక అగ్నిపర్వతం

కేసీఆర్ 3 గంటలే పడుకుంటాడు