పశ్చిమ బెంగాల్​ తీస్తా కెనాల్​లో సిక్కిం మాజీ మంత్రి మృతదేహం

పశ్చిమ బెంగాల్​ తీస్తా కెనాల్​లో సిక్కిం మాజీ మంత్రి మృతదేహం
  • తొమ్మిది రోజుల కింద అదృశ్యమైన ఆర్​సీ పౌడ్యాల్ మృతి

గ్యాంగ్‌‌‌‌టక్ : సిక్కిం మాజీ మంత్రి ఆర్‌‌‌‌సీ పౌడ్యాల్(80) మృతదేహం బుధవారం పశ్చిమ బెంగాల్‌‌‌‌లోని ఓ కాలువలో దొరికింది. తొమ్మిది రోజుల కింద కనిపించకుండా పోయిన పౌడ్యాల్ విగతజీవిగా సిలిగురి సమీపంలోని ఫుల్బరీ వద్ద తీస్తా నది కెనాల్‌‌‌‌లో తేలినట్టు పోలీసులు తెలిపారు. “మృతదేహం తీస్తా నదిలో ఎగువ నుంచి కిందకు కొట్టుకు వచ్చినట్టు అనుమానాలున్నాయి. అతను ధరించిన వాచ్, దుస్తుల ద్వారా పౌడ్యాల్​గా గుర్తించాం. ఆయన మృతిపై ఎంక్వైరీ కొనసాగుతున్నది”అని పోలీసులు తెలిపారు. పౌడ్యాల్ స్వస్థలం సిక్కింలోని ప్యాక్యోంగ్ జిల్లా ఛోటా సింగ్​టామ్.

జులై 7 నుంచి ఆయన అదృశ్యం అయ్యారు. ఆయన్ను వెతికేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ​ఏర్పాటు చేసింది. పౌడ్యాల్ సిక్కిం అటవీశాఖ మంత్రిగా, డిప్యూటీ స్పీకర్​గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన రైజింగ్ సన్ పార్టీని స్థాపించి.. 1970, 80ల్లో సిక్కిం రాజకీయాల్లో చాలా కీలకమైన నేతగా ఉన్నారు. సిక్కిం సంస్కృతి, సోషల్ డైనమిక్స్​పై మంచి అవగాహన కలిగిన నేతగా ప్రసిద్ది చెందారు.