
న్యూఢిల్లీ: ‘స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పేరున్న టాటా స్టీల్ మాజీ ఎండీ జంషెడ్ జే ఇరానీ (86) అనారోగ్యంతో సోమవారం రాత్రి కన్నుమూశారు. జంషెడ్‌పూర్‌లోని టాటా ఆస్పత్రిలో తుదిశ్వాస వదిలారని టాటా స్టీల్ తెలిపింది. దాదాపు 43 ఏళ్లపాటు సేవలు అందించాక, కంపెనీ నుంచి ఆయన 2011లో వైదొలిగారు. ఉక్కురంగం అభివృద్ధికి అందించిన సేవలకుగాను ఆయనకు పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ఇరానీ 1936, జూన్ రెండున నాగ్‌పూర్‌లో జన్మించారు. ఇదే నగరంలో 1958లో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. 1963లో యూకే యూనివర్సిటీ నుంచి మెటలర్జీలో పీహెచ్డీ చేశారు.