టీసీఎస్​ మాజీ సీఈఓ రాజేష్​కు రూ. 29.16 కోట్ల జీతం

టీసీఎస్​ మాజీ సీఈఓ రాజేష్​కు రూ. 29.16 కోట్ల  జీతం

ముంబై: టీసీఎస్​ మాజీ సీఈఓ​ రాజేష్ గోపీనాథన్  మొత్తం వేతనం 13.17 శాతం పెరిగి రూ. 29.16 కోట్లకు చేరుకుంది. 2022–-23 ఆర్థిక సంవత్సరంలో ఈయన రూ. 25 కోట్లకు పైగా కమీషన్, రూ. 1.73 కోట్ల జీతం,  రూ. 2.43 కోట్ల ఇతర ప్రయోజనాలను పొందారు. కంపెనీకి ఆరేళ్లపాటు నాయకత్వం వహించిన గోపీనాథన్ 2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 25.76 కోట్ల జీతం పొందారు.

పెద్ద ఐటీ కంపెనీకి  నాయకత్వం వహించినప్పటికీ, గోపీనాథన్ జీతం తోటివారితో పోలిస్తే తక్కువగా ఉంది.  టాటా సన్స్ ఛైర్మన్‌‌‌‌గా నియమితులు కావడానికి ముందు 2017 ఆర్థిక సంవత్సరంలో ఎన్. చంద్రశేఖరన్ తీసుకున్న మొత్తం కంటే తక్కువగా ఉంది. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నుండి సీఈఓ​ స్థానానికి ఎదగడంతో  గోపీనాథన్ 2017లో రూ. 6.22 కోట్లు డ్రా చేశారు. ఇది 2018 ఆర్థిక సంవత్సరంలో రూ. 12.5 కోట్లకు రెట్టింపు అయింది. 2020 ఆర్థిక సంవత్సరం నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈ ఏడాది సెప్టెంబరు వరకు ఆయన టీసీఎస్​లోనే పనిచేస్తారు.