బిగ్ బాస్ కంటెస్టెంట్గా భారత మాజీ బౌలర్

బిగ్ బాస్ కంటెస్టెంట్గా భారత మాజీ బౌలర్

టీమిండియా మాజీ క్రికెటర్, బౌలర్ వినయ్ కుమార్ బుల్లితెర అరంగేట్రం చేయబోతున్నాడు. అతను బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనబోతున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న కన్నడ బిగ్ బాస్ షో ఓటీటీ వర్షన్ కు వినయ్ కుమార్ ఎంపికయ్యాడు.  బిగ్ బాస్ కన్నడ రిలీజ్ చేసిన కంటెస్టెంట్ల లిస్ట్లో అతని పేరు ఉంది.

బిగ్ బాస్ కన్నడ రియాలిటీ షోకు కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హోస్ట్గా వ్యవహరిస్తున్నాడు. ఈ షోను  వయాకమ్ 18 స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ Voot ఓటీటీ యాప్‌లో ప్రసారం కానుంది. బిగ్ బాస్ కన్నడ ఆగస్టు 6నుంచి ప్రారంభం అవనుంది.  రౌండ్-ది-క్లాక్ కంటెంట్ డ్రాప్‌లు, పూర్తి ఇంటరాక్టివ్ 24x7 లైవ్ ఫీడ్‌ను ప్రేక్షకులు చూసే అవకాశం కలగనుంది. 

బౌలర్ వినయ్ కుమార్ ..టీమిండియాకు  మూడు ఫార్మాట్లలో ఆడాడు. 31వన్డేల్లో 38 వికెట్లు, 9 టీ20 మ్యాచుల్లో 10వికెట్లు తీసుకున్నాడు.  ఒక టెస్ట్ మ్యాచ్ కూడా ఆడాడు.  అటు  ఐపీఎల్‌లో  ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల తరఫున ఆడాడు. 105ఐపీఎల్ మ్యాచుల్లో 105 వికెట్లు పడగొట్టాడు.