స్థానిక సంస్థలకు మరిన్ని నిధులు ఇవ్వాలె

స్థానిక సంస్థలకు మరిన్ని నిధులు ఇవ్వాలె

హైదరాబాద్: స్థానిక సంస్థలకు మరిన్ని నిధులు ఇవ్వాలని టీపీసీసీ మాజీ ప్రెసిడెంట్,  కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామ పంచాయతీలకు నేరుగా ఇవ్వడం కరెక్ట్ కాదని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... లోకల్ బాడీస్ ను బలోపేతం చేయడంలో భాగంగా వాటికి నేరుగా నిధులు ఇచ్చేందుకు రాజీవ్ గాంధీ కృషి చేశారన్నారు. కేసీఆర్ పాలనలో  స్థానిక సంస్థల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. బిల్లులు రాకపోవడంతో చాలా మంది సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

కొనుగోలు కేంద్రాల్లో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారన్న ఆయన... దళారుల మోసంతో తక్కువ ధరకే రైతులు ధాన్యం అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. పోయినేడాది దాదాపు 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం... ఈ సారి  20 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసిందని తెలిపారు. ఇక అభయ హస్తం పథకం కింద డ్వాక్రా మహిళల దాచుకున్న డబ్బులను కూడా కేసీఆర్ వదలడంలేదని, ఇప్పటికే రూ.1070 కోట్లు ప్రభుత్వం వాడుకుందని ఆరోపించారు. ఆ డబ్బును వెంటనే వారి అకౌంట్లలో జమ చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని, వారి ఆగ్రహానికి కేసీఆర్ బలికాకతప్పదని హెచ్చరించారు.

మరిన్ని వార్తల కోసం...

కాంగ్రెస్ లో మూడేళ్లు సమయాన్ని వృథా చేసుకున్నాను

తూకంలో మోసం: వ్యాపారిని బంధించిన రైతులు