తెలుగు రాష్ట్రాల్లో సనాతన ధర్మాన్ని పరిరక్షించే లక్ష్యంతో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. 'నరసింహ వారాహి గణం' పేరుతో ప్రత్యేక విభాగాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. సనాతన ధర్మం పరిరక్షణే ఈ నరసింహ వారాహి గణం లక్ష్యమని ఆయన తెలిపారు. సనాతన ధర్మాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు, సనాతన ధర్మాన్ని అగౌరవపరిచేవారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పవన్ హెచ్చరించారు.
ఘంటా చక్రపాణి సెటైర్లు
నరసింహ వారాహి గణం ఏర్పాటుపై ప్రొఫెసర్, TGPSC (పూర్వపు TSPSC) మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి సెటైర్లు విసిరారు. "ఏమై పోతాడో ఏమిటో? తమ్ముడు!!.." అంటూ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఆవేశపూరితంగా, అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్న పవన్‌ను ఇలానే వదిలేస్తే.. ఏమైపోతారు అన్నట్లుగా అతని ట్వీట్ ఉద్దేశ్యం ఉందని జనసైనికులు మండిపడుతున్నారు.
ఏమై పోతాడో ఏమిటో? తమ్ముడు!! https://t.co/h6RcWTpsF8
— Prof. Chakrapani Ghanta (@GhantaC) November 2, 2024
నువ్వు, నీ బాస్ ఏమైపోతారో..
"ఆయన ఏమి అవ్వడు కాని.. నువ్వు చేసినవి బయటకు వస్తే, నువ్వు, నీ బాస్ ఏమైపోతారో.. అంత పెద్ద రెస్పాన్సిబుల్ పొజిషన్ లో కూర్చొని, ఏం చేశావ్ రా నువ్వు...??? నీ పాపం పండింది.. చూస్తా ఉండు. విద్యార్థుల ఉసురు తగిలి పోతావ్.." అంటూ ఓ నెటిజెన్.. ఘంటా చక్రపాణికి కౌంటర్ ఇచ్చారు.
ALSO READ : “ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం అంటే” ఇదే.. కూటమి సర్కార్పై షర్మిల ఫైర్..
తిడితే కుమిలి కుమిలి పోతావ్..
"నీకు నువ్వే పెద్ద మేధావిలా ఫీల్ అవ్వకు.. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో జరా.. ఒక్క మాట అంటే కుమిలి కుమిలి పోతావ్.. నీ ఏజ్ కీ కీ రెస్పెక్ట్ ఇచ్చి వదిలేస్తున్నాం.." అని మరో జనసైనికుడు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ల పరంపర అలానే కొనసాగుతోంది.
నీకు నువ్వే పెద్ద మేధావిలా ఫీల్ అవ్వకు కానీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో జరా.. ఒక్క మాట అంటే కుమిలి కుమిలి పోతావ్.. నీ ఏజ్ కీ కీ రెస్పెక్ట్ ఇచ్చి వదిలేస్తున్నాం...
— 🇮🇳Anjaneyulu Goud Pawanism 🇮🇳 (@Anjaneyulu_JSP) November 3, 2024