
సోమవారం ( జులై 28 ) కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వీఐపీ దర్శనాలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. సామాన్య భక్తుల సౌలభ్యం కోసం వీఐపీలు ఏడాదికి ఒకసారి మాత్రమే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని అన్నారు వెంకయ్య నాయుడు. సోమవారం ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.
దర్శనానంతరం ఆయనకు రంగ నాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. ఆలయంలో స్వామివారి దర్శనానికి ఉండే స్థలం, సమయం పరిమితంగా ఉండటంతో బయట ఎంత మంచి ఏర్పాట్లు చేసినా రద్దీ కారణంగా భక్తులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు వెంకయ్య నాయుడు.
►ALSO READ | శ్రీశైలానికి రండి.. ప్రధాని మోడీకి ఎంపీ బైరెడ్డి శబరి ఆహ్వానం..
సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని వీఐపీలు ఏడాదికి ఒకసారి మాత్రమే పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులతో శ్రీవారిని దర్శించుకోవాలని.. అప్పుడే దేవస్థానం నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందని అన్నారు.ప్రజా ప్రతినిధులంతా బాధ్యతతో హుందాగా తన సూచనను పాటించాలని కోరారు వెంకయ్య నాయుడు. సామాన్య భక్తులు