బీఆర్ఎస్ కు బిగ్ షాక్ టీఆర్పీలో చేరిన మాజీ జడ్పీటీసీ

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ టీఆర్పీలో చేరిన మాజీ జడ్పీటీసీ

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పెన్ పహాడ్ మాజీ జడ్పీటీసీ మామిడి అనితాఅంజయ్య మంగళవారం హైదరాబాద్​లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్​ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ సమాజంలో సింహాభాగం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రాజ్యాధికారం పని చేయాలన్నారు. 

 అగ్రవర్ణ పార్టీలకు బహుజనులు ఊడిగం చేస్తూ ఎన్నికల్లో యంత్రాల్లా వాడుకుంటున్నారన్నారు.  బహుజనులకు సరైన వేదిక టీఆర్పీ అని అన్నారు.  కార్యక్రమంలో జిల్లా నాయకులు మీర్ అక్బర్, ఆవుల అంజయ్య యాదవ్, మాజీ ఎంపీటీసీ ఉప్పల మల్లయ్య, యాదవ్. బొల్లె సైదులు, వెంకటేశ్, మామిడి ఉదయ్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.