ఫార్ములా ఈ రేస్ ట్రయల్ రన్ కు హైదరాబాద్ సిద్ధం

ఫార్ములా ఈ రేస్ ట్రయల్ రన్ కు హైదరాబాద్ సిద్ధం

హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ ట్రయల్ రన్కు వేళయింది.  ఈ నెల 19,20తో పాటు..డిసెంబర్ 10,11వ తేదీల్లో ఫార్ములా ఈ రేస్ ట్రయల్ రన్ జరగనుంది. ఈ  మేరకు హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ ఎండీ సంతోష్‌ షెడ్యూల్ను విడుదల చేశారు. ఫార్ములా ఈ రేస్ కోసం ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతంలో నూతన రోడ్డు వేశారు. అక్కడున్న చెట్లను తొలగించి రీలొకేట్ చేశారు.  మొత్తం 2.7కిలో మీటర్ల మేర ఫార్ములా ఈ రేస్ జరగనుంది. ఫార్ములా ఈ రేస్లో 5 టీంలు, 20  కార్లు పాల్గొంటాయి. ఇందులో మహీంద్రా, జాగ్వర్‌ లాంటి కంపెనీలు ఉన్నాయి. ఈ రేస్ 280  కిలోమీటర్ల మేర మాక్సిమం స్పీడ్‌ ఉంటుంది. 

ఫార్ములా ఈ రేస్ ట్రయల్ రన్  ఐమాక్స్ పక్క నుంచి  ప్రారంభవనుంది. ఎన్టీఆర్ మార్గ్ మీదుగా.. లుంబిని పార్కు ముందు యూ టర్న్ తీసుకుని.. తిరిగి ఎన్టీఆర్ పార్కు లోపల వేసిన ట్రాక్, ఐమాక్స్ మీదుగా తిరిగి ఐమాక్స్ పక్కకు చేరుకుంటుంది. మొత్తం 2.7 కిలో మీటర్ల ట్రాక్లో 17 టర్నింగ్లు ఉండనున్నాయి. మరోవైపు 50 వేల మంది వరకు  రేస్ వీక్షించేలా ట్రాక్ పక్కన సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్​లో ఫార్ములా ఈ -రేస్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరగనుంది.

ఫార్ములా ఈ రేస్కు సంబంధించి టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. బుక బై షో ద్వారా టికెట్ల అమ్మకాలను నిర్వాహకులు ప్రారంభించారు. రెగ్యులర్ టికెట్ ధరను రూ. 799గా నిర్ణయించారు. వీకెండ్ టికెట్ ధరను రూ. 1249గా నిర్ణయించారు.