రహానెలో మంచి కెప్టెన్ ఉన్నాడు.. అతడిది అగ్రెసివ్ స్టయిల్

రహానెలో మంచి కెప్టెన్ ఉన్నాడు.. అతడిది అగ్రెసివ్ స్టయిల్

మెల్‌‌బోర్న్: టీమిండియా ఆస్ట్రేలియా టూర్ రసవత్తరంగా సాగుతోంది. వన్డే సిరీస్‌‌ను ఆసీస్ చేజిక్కుంచుకోగా, టీ20 ట్రీఫీని భారత్ కైవసం చేసుకుంది. దీంతో తదుపరి జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌‌పై అందరి దృష్టి పడింది. సిరీస్‌‌లో కెప్టెన్ కోహ్లీ తొలి టెస్టులో మాత్రమే అందుబాటులో ఉండనున్న నేపథ్యంలో తదుపరి మూడు మ్యాచుల్లో జట్టును ఎవరు నడిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. వైస్ కెప్టెన్ అజింక్యా రహానె టీమిండియాను ముందుకు తీసుకెళ్లే చాన్స్ ఉంది. దీనిపై ఆస్ట్రేలియా లెజెండ్ ప్లేయర్ ఇయాన్ చాపెల్ స్పందించాడు. 2017లో ఆస్ట్రేలియాతో ధర్మశాలలో జరిగిన టెస్టు మ్యాచులో రహానె అగ్రెసివ్‌‌గా కెప్టెన్సీ చేశాడని చాపెల్ గుర్తు చేశాడు.

‘ఆస్ట్రేలియాతో ఒక టెస్టు మ్యాచ్‌‌లో రహానె కెప్టెన్‌‌గా వ్యవహరిండం నాకు గుర్తుంది. ఆ మ్యాచ్‌‌లో అతడి సారథ్యం అద్భుతంగా సాగింది. అతడు నిజంగా అగ్రెసివ్ కెప్టెన్. రహానె కెప్టెన్సీ గురించి కొన్ని విషయాలు చెప్పుకోవాలి.. ఆ మ్యాచ్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌లో వార్నర్ చాలా బ్యాటింగ్ చేస్తున్నాడు. భారత బౌలర్లపై దూకుడుగా ఆడుతున్నాడు. ఆ టైమ్‌‌లో రహానె కుల్దీప్‌‌ను బౌలింగ్‌‌కు దించాడు. రెండో విషయం.. తక్కువ లక్ష్యాన్ని భారత్ ఛేదిస్తున్న సమయంలో తొందరగా వికెట్లు కోల్పోయింది. అయితే రహానె బ్యాటింగ్‌‌కు వచ్చి ఆసీస్ బౌలర్లపై అటాకింగ్‌‌కు దిగాడు. అది నాకు చాలా నచ్చింది. కెప్టెన్‌‌గా ఉన్నప్పుడు రెండు విధాలుగా వ్యవహరించాలి. ఒకటి దూకుడుగా ఉండటం లేదా రెండోది సాంప్రదాయకంగా మెత్తగా ఉండటం. రహానెది అగ్రెసివ్ శైలి’ అని ఇయాన్ చాపెల్ పేర్కొన్నాడు.