ఇయ్యాల హైకోర్టు కొత్త బిల్డింగ్​కు శంకుస్థాపన

ఇయ్యాల హైకోర్టు కొత్త బిల్డింగ్​కు శంకుస్థాపన
  • అటెండ్ కానున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్ర చూడ్

హైదరాబాద్, వెలుగు : రాజేంద్ర నగర్​లో బుధవారం సాయంత్రం  5.30 గంటలకు రాష్ర్ట  హైకోర్టు కొత్త బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్ర చూడ్ చీఫ్ గెస్టుగా అటెండ్ కానున్నారు. ఈ విషయాన్ని హైకోర్టు రిజిస్ర్టార్ జనరల్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రోగ్రాముకు  హైకోర్టు చీఫ్ జస్టిస్ తో పాటు జడ్జిలు, అడ్వకేట్లు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.

రాష్ర్ట ప్రభుత్వం హైకోర్టు కొత్త బిల్డింగ్ నిర్మాణానికి ఇటీవల 100 ఎకరాల ల్యాండ్ ను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శంకుస్థాపన కార్యక్రామానికి వీలుగా గత కొద్ది రోజులుగా ల్యాండ్ లో ఉన్న చెట్లను తొలిగిస్తూ చదును చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు పలువురు రాజకీయ ప్రముఖలు హాజరు కావాల్సి ఉండగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎవరూ హాజరుకావడం లేదు.