
ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీకి బీహార్ లో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బుధవారం ఆర్జేడీలో చేరారు. 2020 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. ఇందులో అక్తరుల్ ఇమాన్ (అమూర్ నియోజకవర్గం), మహ్మద్ ఇజార్ అస్ఫీ (కొచ్చాడమామ్), షానవాజ్ ఆలం (జోకిహాట్), సయ్యద్ రుక్నుద్దీన్ (బైసీ), అజర్ నయీమి (బహదూర్‌గంజ్) ఉన్నారు. అయితే అక్తరుల్ ఇమాన్ మినహా మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆర్జేడీలో చేరారు. వారి చేరికను తేజస్వీ యాదవ్ స్వాగతించారు. బీహార్ అసెంబ్లీలో ప్రస్తుతం ఆర్జేడీకి 76 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీజేపీకి 77 మంది ఉన్నారు. ఈ ఫిరాయింపుతో అసెంబ్లీలో ఆర్జేడీ సంఖ్య 80కు చేరుకుంది. బీహార్ లో 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయగా ఒక్క సీటు కూడా గెలుపొందలేదు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కిషన్‌గంజ్ స్థానంలో తొలి విజయాన్ని అందుకుంది. 2020 ఎన్నికల్లో 20 స్థానాల్లో పోటీ చేయగా 5 స్ధానాలలో గెలుపొందింది.
बिहार विधानमंडल (राजद) परिवार से जुड़े 4 नए सदस्य!
— RJD East Champaran (@ChamparanEast) June 29, 2022
AIMIM के 4 सदस्यों ने गरीब, मजलूम, शोषित वर्गों की लड़ाई मजबूती से लड़ने के लिए @RJDforIndia के नेतृत्व को स्वीकारा!@RJDforIndia @yuva_rajad pic.twitter.com/PITACSZ3i6