కల్వకుర్తి లో డ్రంకెన్​డ్రైవ్ లో దొరికిన నలుగురికి జైలుశిక్ష

కల్వకుర్తి లో డ్రంకెన్​డ్రైవ్ లో దొరికిన నలుగురికి  జైలుశిక్ష

కల్వకుర్తి, వెలుగు: కల్వకుర్తి పట్టణంలో పోలీసులు గురువారం డ్రంకెన్​డ్రైవ్​తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నలుగురు మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ, మరో 14 మంది సరైన ధ్రువపత్రాలు, నంబర్ ప్లేట్లు లేక పట్టుబడ్డారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టగా.. మద్యం మత్తులో వాహనాలు నడిపిన వారికి మూడు రోజుల జైలుశిక్ష, రూ.100 చొప్పున జరిమానా, మిగతా వారికి వాహనాల మీటర్​రీడింగ్​ను బట్టి జరిమానా విధిస్తూ కల్వకుర్తి జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కావ్య తీర్పు చెప్పారని ఎస్సై మాధవరెడ్డి తెలిపారు.