
టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ మరోసారి తండ్రి అయ్యారు. న్యూరాలింక్ స్పెషల్ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూటివ్ షివోన్ జెలిస్‌తో కలిసి ఎలన్ మస్క్ మూడో బిడ్డకు జన్మనిచ్చినట్లు నాలుగు రోజుల క్రితం బ్లూమ్ బెర్గ్ వెల్లడించింది. ప్రస్తుతం ఎలన్ మస్క్ కు 52ఏళ్లు. అయితే దానిపై మస్క్ స్పందించారు. మాకు బిడ్డ పుట్టినట్టు బంధువులకు, స్నేహితులకు అందరికీ తెలుసని ఆయన అన్నారు. ఆ విషయం మీడియాకు మాత్రమే చెప్పలే అని, అదేమి సీక్రెట్ కాదని ఎలన్ మస్క్ స్పష్టం చేశారు.
ఇదివరకే ఈ జంటకి 2021లో కవలలు పుట్టిన సంగతి తెలిసిందే. ఎలాన్ మస్క్‌కు ఇప్పటికే 11మంది సంతానం ఉన్నారు. వీరిలో ఐదుగురు మస్క్ ఫస్ట్ భార్య జస్టిన్ మస్క్ కు, మరో ముగ్గురు మ్యూజిషియన్ గ్రిమెస్ కు, ఇంకో ముగ్గురు షివోన్ జెలీస్ కు పట్టారు.