ఎంజాయ్ : ఈ నెలలోనే.. వరసగా 4 రోజులు సెలవులు

ఎంజాయ్ : ఈ నెలలోనే.. వరసగా 4 రోజులు సెలవులు

వరసగా నాలుగు రోజులు సెలవులు వస్తున్నాయి.. అది కూడా ఈ నెలలోనే.. ఇయర్ ఎండ్ లో,, దీంతో హైదరాబాద్ సిటీ జనంతోపాటు.. తెలంగాణ వ్యాప్తంగా టూర్లకు ప్లాన్ జరుగుతుంది. వరసగా నాలుగు రోజులు ఎలా అంటారా.. డిసెంబర్ 23వ తేదీ నాలుగో శనివారం.. స్కూల్స్ కూడా హాలిడే.. డిసెంబర్ 24వ తేదీ ఆదివారం.. డిసెంబర్ 25వ తేదీ సోమవారం క్రిస్మస్ పబ్లిక్ హాలిడే.. డిసెంబర్ 26వ తేదీ బాక్సింగ్ డే.. ఆ రోజు మంగళవారం కూడా తెలంగాణ రాష్ట్రంలో సెలవు.. సో.. 2023 సంవత్సరం వెళ్లిపోతూ.. వరసగా నాలుగు రోజులు సెలవు ఇచ్చింది..

అసలు ఇయర్ ఎండ్ మూడ్.. చాలా రోజుల తర్వాత వరసగా నాలుగు రోజులు హాలిడేస్ రావటంతో హైదరాబాద్ వాసులు టూర్ ప్లాన్ చేసుకుంటున్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది.. ఈ క్రమంలోనే చాలా మంది ఆలయాలకు, టూరిస్టు స్పాట్లకు వెళ్లాలని ప్రణాళికలు రచించుకుంటున్నారు.. ఇప్పటికే ఈ మేరకు ప్లానింగ్ కూడా జరిగిపోయింది..

ఐటీ, ఇతర కార్పొరేట్ ఉద్యోగులు అయితే విహార యాత్రలకు ప్లాన్ చేస్తుండగా.. రూరల్ ఏరియాలో మాత్రం రాష్ట్ర పరిధిలో నాలుగు చక్కగా తిరిగి రావటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మొత్తానికి వరసగా వచ్చిన నాలుగు రోజుల సెలవులతో.. తెలంగాణలోని టూరిస్టు ఏరియాలు అన్నీ మహిళలతో కళకళలాడటం ఖాయం..