హైరైజ్ అపార్ట్మెంట్ టవర్లకు టవర్లు తగలబడిపోయాయి: హాంకాంగ్లో చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదం

హైరైజ్ అపార్ట్మెంట్ టవర్లకు టవర్లు తగలబడిపోయాయి: హాంకాంగ్లో చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదం

హాంకాంగ్: హాంకాంగ్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. హాంకాంగ్లోని అతి పెద్ద రెసిడెన్షియల్ ఎస్టేట్ అయిన వాంగ్ ఫక్ కోర్ట్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాద ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన ఏడుగురిని ఆసుపత్రికి తరలించారు. ఇందులో నలుగురు చనిపోగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

ఈ రెసిడెన్షియల్ ఎస్టేట్లో దాదాపు 2 వేల అపార్ట్మెంట్స్ ఉన్నాయి. హాంకాంగ్ కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2 గంటల 51 నిమిషాలకు ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. హాంకాంగ్‌లోని తాయ్ పోలోని వాంగ్ ఫక్ కోర్ట్ హౌసింగ్ ఎస్టేట్లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఆ ప్రాంతమంతా పొగ కమ్మేసింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

హైదరాబాద్ సిటీ చాలా మంది చూస్తూ ఉంటారు.. హై రైజ్ అపార్ట్ మెంట్స్.. 30, 40, 50 అంతస్తుల బిల్డింగ్స్.. అలాంటి మూడు హైరైజ్ అపార్ట్మెంట్ టవర్లు వరసగా తగలబడుతూ ఉంటే ఎలా ఉంటుందో.. ఎంత భయనకంగా ఉంటుందో హాంకాంగ్ దేశంలో జరిగిన ఈ దుర్ఘటన కళ్లకు కట్టింది. హాంకాంగ్లోని తాయ్ పో ఏరియాలోని వాంగ్ ఫక్ కోర్ట్ ఏరియాలో 50 అంతస్తుల హైరైజ్ అపార్ట్ మెంట్ టవర్ల నిర్మాణం జరుగుతుంది.

ఒకటి కంప్లీట్ అయ్యి.. మరో రెండు టవర్లకు ఫినిషింగ్ వర్క్ జరుగుతుంది. ఈ క్రమంలోనే.. 2025, నవంబర్ 26వ తేదీ ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మూడు హైరైజ్ అపార్ట్ మెంట్ టవర్లు మంటల్లో కాలిపోవటం కనిపించింది. హాంకాంగ్ లో అగ్నిప్రమాదాలకు రేటింగ్ ఉంటుంది. ఒకటి నుంచి 5 రేటింగ్ ఇస్తారు. ఈ ప్రమాదానికి 4 రేటింగ్ ఇచ్చారు.. అంటే ఇది ఘోర అగ్నిప్రమాదం అని స్పష్టమవుతోంది.

ALSO READ : మాదాపూర్లో 400 మందిని..